మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాహిర్బీన్ హంధాని మాట్లాడుతూ..పేదవాడు గొప్పవాడు కావాలి రైతు రాజు కావాలి అని కలుగని వాటిని సహకారం చేసిన గొప్ప నాయకుడు దివంగత డాక్టర్ వైయస్ అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా వైఎస్ తో నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యూనివర్సిటీ,మెడికల్ కళాశాల, అలిసాగర్ గత్ప నీటి ఎత్తిపోతల పథకం వైఎస్ హయంలో నే జరిగిందని గుర్తు చేశారు.
అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత గృహాలు వంటి సంచలనాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఘనత దివంగత వైఎస్ఆర్ కే చెందుతుందని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎవ్వరు చేయలేని పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని ఆయన తెలిపారు.అదే విధంగా వైఎస్ కు రైతాంగం పైన ఉన్న ప్రేమతో తొలి సంతకం ఉచిత విద్యుత్,విద్యుత్ బకాయిలా మీద చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.