నామినేటెడ్ పదవుల ఫై ఎట్టకేలకు అడ్డంకులు తొలిగాయి. లోకసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన నామినేటెడ్ ఛైర్మెన్ పదవులకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా సోమవారం ఉత్తర్వ్యూలు జారీచేసింది. మార్చి 15 తేదీన ఉన్న జీవో నే ప్రభుత్వం జారీ చేసింది.
జిల్లా నుంచి నలుగురికి నామినేటెడ్ ఛైర్మెన్ పదవులు దక్కాయి. ఈ మేరకు అనిల్ ఇరవత్రి సోమవారమే బాధ్యతలు చేపట్టారు.నియామకం ఉత్తర్వ్యూలు వెలుబడిన అయిదు మసాల తర్వాత వీరు బాధ్యతలు చేపట్టబోతున్నారు.
మొదటి దఫా నామినేటెడ్ పదవుల నియామకాల్లో జిల్లాకు చెందిన నాలుగు రు కీలక నేతలకు ప్రాధాన్యత ఉన్న పదవులు దక్కాయి. మరో ఇద్దరికీ సైతం నామినేటెడ్ ఛైర్మెన్ పదవులు వస్తాయని సమాచారం.
లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు రోజుల ముందే రేవంత్ ప్రభుత్వం హడావుడిగా నామినేటెడ్ పదవులను ప్రకటించింది. కానీ బాధ్యతలు చేపట్టకుండా నిలువరించింది.
ఎన్నికల కోడ్ తొలిగి పోయాక అధికార ఉత్తర్వ్యూలు ఇస్తామని భరోసా ఇచ్చింది. కానీ . పదవులు వచ్చాయనే సంబరమే ఆ నేతల్లో లేకుండా పోయింది.
లోకసభ ఎన్నికల కోడ్ తొలిగిపోయాక ఉత్తర్వ్యూలు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చినప్పటికి ఇంకా అధికారికంగా ఆదేశాలు ఇవ్వడానికి నెల రోజులుగా కాలయాపన చేయడం ఫై విమర్శలు వెల్లువెత్తాయి.
అనిల్ ఇరవత్రి కి మినరల్ డెవలప్ మెంట్ అన్వేష్ రెడ్డికి సీడ్ డెవలప్ మెంట్ కాసుల బాలరాజు కు ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ మానాల మోహన్ రెడ్డికి కో ఆపరేటివ్ యూనియన్ ఛైర్మెన్ లు నియామకం అయ్యారు.
నామినేటెడ్ ఛైర్మెన్ లుగా నియామకం అయిన నలుగురు నేతలు పదవులు పొందడానికి అర్హులే.ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న వారే అందులోనూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్ ల నుంచి టికెట్ కోసం సర్వశక్తులు ఒడ్డిన సీనియర్ నేతలే ఎవ్వరూ కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలు కాదు.
కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే టికెట్ రాకపోయినా పార్టీ వీడకుండా గట్టిగా పనిచేసారనే ముద్ర వేసుకున్నారు. వీరిలో బాలరాజు బాన్స్ వాడ సెగ్మెంట్ కాగ మిగితా ముగ్గురు బాల్కొండ సెగ్మెంట్ కు చెందిన వారు. అయితే ఈ రెండు సెగ్మెంట్ లలోనూ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలయ్యింది.
అయినప్పటికి పదవులు మాత్రం దక్కాయి.బాన్స్ వాడ నుంచి టికెట్ ఆశించి బంగ పడిన బాలరాజు చివరికి ఆత్మ హత్య కు పాల్పడ్డాడు. ఓ దశలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సన్నిహితులే ఒత్తిడి చేసినా రేవంత్ భరోసా ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఓడినా ముందుఇచ్చిన మాట మేరకు బాలరాజు కీలక పదవీ ఇచ్చారు.
అలాగే నిజామాబాద్ జిల్లా నుంచి ఒక్క బాల్కొండ సెగ్మెంట్ నుంచే ఏకంగా ముగ్గురు నేతలకు నామినేటెడ్ ఛైర్మెన్ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే అనిల్ ఇరవత్రి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ,కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి లకు సైతం ప్రాధాన్యత ఉన్న పదవులే కట్టబెట్టారు.
ఈ ముగ్గురు టికెట్ కోసం చివరి దాక పట్టుబట్టినవారే కానీ అధిష్ఠానం హామీ తో వెనక్కి తగ్గారు. అందుకు ప్రతిపలంగానే మొదటి దఫాలో నే అందలం దక్కింది. కానీ వారికి బాధ్యతలు అప్పగించే ఆదేశాలు మాత్రం ఇంకా సర్కార్ ఇవ్వడం లేదు.
పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో నామినేటెడ్ పదవుల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కో సెగ్మెంట్ లో కనీసం ఇద్దరు సీనియర్ నేతలు నామినేటెడ్ పదవులు దక్కాలి.
కానీ పదవులు తక్కువగా ఉండడంఆశావహులు ఎక్కువగా ఉండడం తో సర్దుబాటు చేయడం అదిష్టానం కు కత్తిమీద సాముగా మారింది. అందుకే పదవుల పందేరం ఫై వివాదం తలెత్తింది.మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సిఫారస్ చేసిన వారికే పదవులు దక్కడం ఫై మిగితా దిగ్గజ నేతలు రగిలిపోయారు.
లోకసభ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో వీరికి పదవులు ఇస్తారని లేదా అనే చర్చ జరిగింది