రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఉదయం వ్యక్తి మృతి చెందిన ఘటన కోటగిరి మండలం నాగేంద్ర పురం వద్ద చోటుచేసుకుంది వివరాల్లోకెళ్తే నాగేంద్ర పురం గ్రామానికి చెందిన గైని పవన్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది అతివేగంగా వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం పైన ఉన్న గైని పవన్ కు తీవ్ర గాయాలయ్యాయి.
తలభాగంలో గాయాలు కావడంతో బోధన ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి ఇన్చార్జ్ ఎస్సై సాయన్న తెలిపారు
