Monday, April 20, 2026
HomeTelanganaNizamabadప్రగతి సాధనకు ప్రజా సంక్షేమ బడ్జెట్ -- ...

ప్రగతి సాధనకు ప్రజా సంక్షేమ బడ్జెట్ — బొబ్బిలి రామకృష్ణ, నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు.

జన రంజక బడ్జెట్, ప్రజా పాలనకు నిదర్శనం – మల్యాల గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. —–రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 2026 – 27 సంవత్సరానికి గాను3,24,234 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది, ఈ బడ్జెట్ పట్ల నిజామాబాద్ కార్పొరేషన్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి సాధనకు ప్రజా సంక్షేమ బడ్జెట్ గా అద్దం పడుతుందని అన్నారు, ముఖ్యంగా విద్యారంగాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం 7.58 శాతం, కి అదనంగా ఈ సంవత్సరం 26 వేల 674 కోట్లు, 8.2 శాతం కేటాయించింది అన్నారు, అంటే గత సంవత్సరం కంటే 3566 కోట్లు అదనంగా కేటాయించి తెలంగాణలో విద్యకు గల ప్రాధాన్యతను గుర్తించింది అన్నారు, అంతేకాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం ఆరోగ్య పథకానికి 1056 కోట్లు ఉచిత వైద్యం కోసం కేటాయించింది అన్నారు,

వ్యవసాయ అభివృద్ధి కోసం23179 కోట్లు, మరియు రైతు భరోసా కోసం18000 కోట్లు కేటాయించి రైతు సంక్షేమ ప్రభుత్వంగా నిలిచింది అన్నారు, పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చే విధంగా గృహ నిర్మాణ శాఖకు 7430కోట్లు కేటాయించి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కృషి చేస్తుంది అన్నారు, కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 998కోట్లు కేటాయించిందని అన్నారు, ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ జన రంజక బడ్జెట్ గా ఉందని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!