HomeTelanganaNizamabadవిద్యారంగానికి కేవలం 8.23% నిధులు కేటాయించడం దారుణం – బడ్జెట్ సవరణ...

విద్యారంగానికి కేవలం 8.23% నిధులు కేటాయించడం దారుణం – బడ్జెట్ సవరణ చేసి నిధులు పెంచాలి: PDSU రాష్ట్ర నాయకులు ప్రిన్స్ డిమాండ్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం తీవ్రంగా ఖండనీయమని *PDSU రాష్ట్ర నాయకులు ప్రిన్స్* అన్నారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి కనీసం 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

అలాగే విద్యా కమిషన్ కూడా కనీసం 18% నిధులు ఇవ్వాలని సూచించిన విషయాన్ని ప్రస్తావించారు.కానీ ప్రస్తుత బడ్జెట్‌లో మొత్తం రూ.3,24,234 కోట్లలో కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే విద్యారంగానికి కేటాయించడం జరిగిందని, ఇది కేవలం 8.23% మాత్రమేనని ఆయన విమర్శించారు.

గతంలోనుంచి విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు విద్యారంగ అభివృద్ధి కోసం కనీసం 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు రూ.7,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత కేటాయింపులు విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సరిపోవని స్పష్టం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని PDSU తరఫున డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments