HomeCRIMEఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతొ టోకరా …విద్యా వైద్య శాఖల్లో కొలువుల పేరుతొ భారీగా వసూళ్లు...

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతొ టోకరా …విద్యా వైద్య శాఖల్లో కొలువుల పేరుతొ భారీగా వసూళ్లు ….ఓ ముఠా నిర్వాహకం …….

ఔట్ సోర్సింగ్ ద్వార ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ ముఠా జిల్లాకేంద్రంలోని భారీగా వసూళ్ల ఎగ బడింది. అధికార పార్టీలో పెద్దలతో లింక్ లున్నాయని నమ్మబలికి అమాయకులైన నిరుద్యోగుల బుట్టలో వేసుకొని నిలువునా దోచుకున్నారు.

డబ్బులతో పాటు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లు సైతం ముఠా వద్దే ఉండడంతో బాధితులు నోరెత్తని పరిస్థితి! హైదారాబాద్ కు చెందిన ఇద్దరు సభ్యులున్న ఓ ముఠా నగరంలోని ఫెమస్ స్టార్ హోటల్ లో మూడు నెలల క్రితం మకాం వేసింది.

తాముకు అధికార పార్టీ లో కీలక నేతలతో సాన్నిహిత్యం వుందని నమ్మబలుకుతూ నిరుద్యోగుల టార్గెట్ చేశారు. జిల్లా కేంద్రంలోనే వైద్య ఆరోగ్య , విద్యా శాఖల్లో అవుట్ సోర్సింగ్ ద్వార కిందిస్థాయి ఉద్యోగాల నియామకాలు జరగబోతున్నాయని నమ్మించారు.

కొంత కాలం పనిచేస్తే ఎన్నికల టైమ్ లో ప్రభుత్వం రెగ్యులర్ చేస్తారని భరోసా ఇచ్చారు. ఇప్పుడు జీతం తక్కువగానే ఉన్నా రాబోయే రోజుల్లో పెరుగుతుందని చెప్పారు.

అంతే ఉద్యోగ ఆశలో పడ్డరు. ఒక్కరి నుంచి లక్షన్నర రూపాయలు వసూలు చేసారు. కొద్దీ రోజుల గ్యాప్ తరవాత బాధితులకు అనుమానం రాకుండా మీ ఒరిజినల్ సర్టిఫికెట్ లు ఇవ్వాలని ఒత్తడి చేసి తీసుకున్నారు.

అబ్బో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పక్రియ కూడా అవుతుండడంతో జాబ్ గ్యారెంటీ అనుకున్నారు. వారం రోజుల పాటు జిల్లా కేద్రంలోనే హడావుడి చేసిన ఈ ముఠా ఆతర్వాత హోటల్ నుంచి మాయం అయ్యారు.

ఉద్యోగాల ఊసే లేక పోవడంతో అనుమానం వచ్చిన బాధితులు హోటల్ కు వెళ్లి అరా తీస్తే వారు చెక్కేశారని తెల్సి గాబరా పడ్డారు కానీముఠా కు చెందిన ఒకరి ఫోన్ ఆన్ లో వుండడంతో ఫోన్ చేసి వాకబు చేశారు. ఎహే ఆ పైరవీ చేయడానికి తిరుగుతున్నాం.

లోకల్బాడీ ఎన్నికల లోపే నోటిఫికేషన్ రాబోతుంది మీ సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ కూడా అయిపోయిందని బుకాయిస్తున్నారు. ఈ ముఠా ఎంత మంది వద్ద డబ్బులు వసూలు చేసింది పక్కాగా తెలియరావడం లేదు. కానీ 15 నుంచి 20 మంది వరకు ఈ జాబ్ ల కోసం డబ్బులు ఇచ్చారని సమాచారం.

వీరిలో చాలా మంది ఖలీల్ వాడి సెంట్రల్ లైబ్రెరీ కి వచ్చి చదువు కునే వారే ఎక్కువగా ఉన్నారు. తమ వైలువైన సర్టిఫికెట్ లు వుండడం వల్లే పిర్యాదు చేయలేక పోతున్నామని ఇద్దరు బాధితులు లైబ్రెరీ వద్ద ఉన్న పార్కింగ్ ఆవరణలో ఇది సంగతి ప్రతినిధి తో వాపోయారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments