Monday, December 8, 2025
HomeCRIMEజీవితంపై విరక్తితో మహిళ ఆత్మ హత్య..

జీవితంపై విరక్తితో మహిళ ఆత్మ హత్య..

జీవితంపై విరక్తి చెంది మహిళ ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోనీ చోటు చేసుకుంది. రూరల్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని ముభారక్ నగర్ కు చెందిన హోలియ రూప(35). ముగ్గురు పిల్లలు ఉన్నారు.

భర్త రాజేష్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లారని తెలిపారు. రూప మూర్ఛ వ్యాధి,అనారోగ్యం తో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నట్లు తెలిపారు.

ఈమేరకు జీవితం పై విరక్తి చెంది శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!