ఉరుకుల పరుగుల జీవితానికి సంతోషం కలిగించే అత్యంత ముఖ్యమైన వ్యక్తులు కొందరు ఉంటారు. వారు ఎవరో కాదు మన స్నేహితులు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఉడదుడుకులు ఉన్న.. స్నేహితులతో చెప్పుకుంటే, గడిపితే చాలు మన కష్టాలన్నీ మర్చిపోతాం.
అలాంటి స్నేహానికి ఒకరోజు ఉంది అదే ఫ్రెండ్షిప్ డే.ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్షిప్డే జరుపుకుంటారు.ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విషెస్ చెప్పుకొంటూ ఒకరికి ఒకరు అలింగనం చేసుకుంటూ సెలబ్రేషన్ వేడుకలు నిర్వహించారు.
నేడు ఫ్రెండ్షిప్ డే దినోత్సవం సందర్భంగా యువత స్పెషల్ ప్లాన్స్ కి సిద్ధమవుతున్నారు. తమ ఆత్మీయ మిత్రులకు. శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. అలాగే మార్కెట్లో లభించే ఫ్రెండ్షిప్ బ్యాండ్లను సైతం ఒకరికొకరు వేసుకొని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా. నగరంలో ప్రజల వీధిలో కిటకిటలాడుతున్నాయి. ఐక్యరాజ్యసమితి జూలై 30వ తేదీని ఫ్రెండ్ షిప్ డేగా ప్రకటించింది. కానీ మనదేశంలో మాత్రం ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.