పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు ఏసిపి విష్ణుమూర్తి ఆద్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని మదవనగర్ ప్రాంతంలోని బైపాస్ రోడ్డు పక్కన నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో పేకాట అదుడుతున్న ఐదుగురిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పురుషోత్తం తెలిపారు.
వారి నుంచి రూ.6990 నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐదుగురిని డిచ్ పల్లి పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో లక్ష్మయ్య,సుదర్శన్,రాములు,అనిల్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
