అతివేగంతో కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన సంఘటన నగరంలోను రెండవ టౌన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.
ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని చౌరస్తా నుంచి నిజామాబాద్ వైపుగా అతి వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి ఐటిఐ కళాశాల పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఇంటి కపౌండ్ గోడ కూలడంతో పెద్ద శబ్దం వచ్చింది. హుటాహుటిన ఇంట్లో నుంచి బయటకు పరుగులు చేశారు. అందరూ ఇంటి లోపల నిద్ర పోతుండటంతో పెను ప్రమాదం తప్పింది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారులో ఉన్న నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్ తెలిపారు.