ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు వాగులో ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగి మృతి చెందాడు.
ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన పోగుల రాహుల్ 19 అదే గ్రామానికి చెందిన ఓ అంతక్రియలో పాల్గొని పక్కనే ఉన్న మగ్గిడి వాగులో స్నానం చేసేందుకు దిగాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీట మునిగి గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి మృతదేహాన్ని నీటిలో గాలించి వెతికి తీశారు. పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.