Monday, December 8, 2025
HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ లో హై టెన్షన్- మరో పోరు గడ్డకు సిద్ధమవుతున్న ఆర్మూర్- చలో ఆర్మూర్ కు...

ఆర్మూర్ లో హై టెన్షన్- మరో పోరు గడ్డకు సిద్ధమవుతున్న ఆర్మూర్- చలో ఆర్మూర్ కు తరలి రానున్న రైతులు- భారీగా మోహరించిన పోలీసు బలగాలు

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో హై టెన్షన్ నెలకొంది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో పార్టీలకతీతంగా చలో ఆర్మూర్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో

ఆర్మూర్ పట్టణానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రానున్నారు. మరోపక్క బి ఆర్ ఎస్, బిజెపి, వామపక్షాలు చలో ఆర్మూర్ కార్యక్రమానికి మద్దతు పలికాయి.

రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని రైతు సంఘాలు పిలుపునివ్వడంతో కాంగ్రెస్ సర్కార్ పై నిరసన వ్యక్తం చేసేందుకు ఆర్మూర్ మరో పోరుగడ్డకు వేదిక అవుతుంది.

ఇంకోపక్క చలో ఆర్మూర్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. చలో ఆర్మూర్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవంటున్న పోలీసులు రోడ్డు ఎక్కితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈనెల 25వ తేదీ వరకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో విధిస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.

ఇలా ఉండగా తాము శాంతియుతంగా కాంగ్రెస్ సర్కారుకు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతుంటే అధికార కాంగ్రెస్ నేతలు అడ్డంకులు సృష్టిస్తున్నారని, పోలీసుల సూచన మేరకే…

వారి అనుమతితో ఆంక్షలతో కూడిన నిరసన కార్యక్రమం చేసి తీరుతామని, రైతులంతా తరలి రానున్నారని రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు అంటున్నారు.

శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మొహరించడంతో, ఓ పక్క రైతులు మరోపక్క పోలీసు బలగాలతో ఆర్మూర్ లో హై టెన్షన్ నెలకొంది. మధ్యాహ్నం భారీ నిరసన కార్యక్రమం రైతులు నిర్వహించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!