గుండె ఆపరేషన్ వికటించి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట లోని మెడికవర్ ఆసుపత్రిలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన తీవ్ర ఉద్రిక్త కు దారితీసింది. పేషంట్ మృతి చెందిన విషయం డాక్టర్లు బయటికి చెప్పకుండా జాప్యం చేయడంవల్లే వివాదం రగిలింది.
ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పిన డాక్టర్లు మృతి చెందిన విషయం చెప్పకుండా తమకు రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం తో మృతి ని బందువులకు అనుమానం వచ్చింది అరా తీయడంతో విషయం బయటికి పొక్కింది. దీనితో ఆగ్రహించిన మృతి బంధువులు పెద్దసంఖ్యలో ఆసుపత్రి కి వచ్చి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగారు.
ఆందోళనకు కారులను మాటల్లో పెట్టి మృతదేహం ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. మృతిని కుటింబీకులు ఊరేగింపుగా వెళ్ళి కలెక్టర్ ను కలిశారు. బోధన్ నియోజక వర్గంలోని నవీపేట మండలం నిజాంపూర్ గ్రామానికి చెందిన పిట్ట నారాయణ (38) ఈనెల 8న గుండెకు సంబంధించిన సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
వెంటనే బంధువులు ఆర్ యంపీ ద్వార నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట వద్దగల మెడికవర్ ఆస్పత్రికి తీసుకోవచ్చారు.ఆస్పత్రిలో సదరు వ్యక్తిని వైద్యులు పరీక్షించి గుండె లో మూడు నాళాలు బ్లాక్ అయ్యాయి వెంటనే సర్జరీ చేయాలని చెప్పారు.
వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్ లను కోరారు . సర్జరీకి సంబం ధించిన డబ్బుల విషయమై ఆరోగ్యశ్రీ నుండి అప్రూవల్ రాగానే సర్జరీ చేస్తా నని డాక్టర్ చెప్పారు. దీంతో ఈనెల 10న సర్జరీకి సంబందించి ఆరోగ్యశ్రీ నుంచి ఆమోదం వచ్చింది.
దీంతో డాక్టర్ల రెండు రోజుల క్రితమే సర్జరీ చేసారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని ఆరోగ్యంతో ఉన్నాడని ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎవ్వరు కలవొద్దని డాక్టర్లు బందువులకు స్పష్టం చేసారు.కానీ మిగతా పేషంట్ ల బంధువులు ఐసీయూ లో కి వెళ్లి రోగులను చూసి వస్తుండడంతో అనుమానం వచ్చి తాము బలవంతంగా శుక్రవారం ఉదయం వెళ్లి చూశామని కానీ అక్కడ మానిటర్ లు ఆఫ్ చేసి ఉండడంతో స్టాఫ్ నర్స్ ను గట్టిగా నిలదీశామని ఆమె వెళ్లి డాక్టర్ తీసుకొచ్చారం మృతుడి బంధువులు వివరించారు.
డాక్టర్ వచ్చి నారాయణ మృతి చెందాడని చెప్పారని వారు అన్నారు . కానీమృతి చెందిన విషయం ఎందుకు తమకు చెప్పలేరని బాధితులు ఆసుపత్రి వర్గాల తో వాదించారు అసలు నారాయణకు సర్జరీ చేయడం లోను డాక్టర్ లు రోజుల తరబడి జాప్యం చేశారనేది బాధితుల ఆరోపణ ,. ఒకరోజు ఆపరేషన్ థియేటర్లో లైట్లు పనిచేయడం లేదని ,మరో రోజు ఎన్నికలు ఉన్నాయని మరో రోజు ఆసుపత్రిలో పేషెంట్లు బాగా ఉన్నారని ఇలా రోజుకోఒక సాకుతో సర్జరీ తేదీ కాస్త పొడిగిస్తూ వచ్చాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనెల 8న ఆసుపత్రికి వస్తే… మరుసటి రోజే సర్జరీ చేయాల్సిన ఉండగా.. 8 రోజుల తర్వాత గురువారం ఆస్పత్రిలో వైద్యులు రోగికి సర్జరీ చేశారు. మధ్యాహ్నం సర్జరీ చేసిన అనంతరం వైద్యులు రోగి బందువూలతో మాట్లాడుతూ ఆపరేషన్ విజయవంతం అయింది ధైర్యంగా ఉండాలని రోగి బంధువులకు భరోసా కల్పించారు.
కానీ ఆపరేషన్ అనంతరం కొన్ని గంటల వ్యవధిలోనే సదరు రోగి మృతి చెందాడన్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .. దీంతో రోగి బంధువులు కోపోద్రిక్తులై న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేం తవరకు ఇకనుంచి వెళ్ళేది లేదంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు . పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అయితే బాధితులు ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయం కు వెళ్లారు. ఈలోపు మృతదేహం ను ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు