నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఆలస్య వెలుగులోకి వచ్చింది.ఈపాటికే మెడికల్ కాలేజీ లో ఆత్మహత్యఘటనలు ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో ఈసారి మరో జూనియర్ డాక్టర్ ఆత్మ హత్య కు యత్నించడం కలకలం రేపింది.
ప్రభుత్వ వైద్య కళాశాలలో మహిళా జూనియర్ డాక్టర్ గత రెండు రోజుల కిందట ఆత్మహత్యాయత్నం చేసిందని విశ్వనీయంగా తెల్సింది. జూనియర్ డాక్టర్ కుటుంబం కలహాల వల్ల మనస్థాపం కు గురై రెండు రోజులక్రితం నిద్ర మాత్రలు మింగడం వల్ల అపస్మార స్థితిలోకి వెళ్ళింది.అదే రూమ్ లో ఉన్నమిగితా జూనియర్ డాక్టర్లు గమనించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలిసి సదురు జూనియర్ డాక్టర్ కుటుంబ సభ్యులు వచ్చి పరామర్శించారు . కుటుంబ కలహాల వల్ల మనస్థాపం చెంది ఈ విధంగా ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు.