ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెయిర్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. శుక్రవారం సుభాష్ నగర్ లోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెయిర్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 400 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ అంబోజి హరిప్రసాద్ తెలిపారు.
ఈ జాబ్ ఫెయిర్ లో టాటా ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ అడ్డా, పేటీఎం, ఆక్సిస్ బ్యాంక్ , ఫాక్స్ కాన్, వరుణ్ మోటార్స్ వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ ఇంటర్వ్యూలలో వంద మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ అంబోజి హరిప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాలలో నిర్వహించిన జాబ్ ఫెయిర్ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకున్నారు. వంద మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.


