HomePOLITICAL NEWSArmoorత్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు…! జూలై మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం …..కాంగ్రెస్ నేతల్లో...

త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు…! జూలై మొదటి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం …..కాంగ్రెస్ నేతల్లో ప్రచారం ?

జాన రమేష్ : ఇది సంగతి :

ఆర్మూర్: స్థానిక సంస్థల ఎన్నికలకు రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతుందనే ప్రచారం మొదలయ్యింది. పార్లమెంట్ ఎన్నికల పక్రియ జూన్ 4 తో పూర్తీ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం సకాలం లోనే నిర్వహించే దిశగా సర్కార్ కసరత్తులు చేస్తుంది.ఎలాగో . గత మూడు నెలల కిందటే సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది.

దీంతో కొన్ని గ్రామాలలో పాలన పడకేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామాలలో సర్పంచులుగా పోటీ చేసేందుకు పలువురు సిద్ధమవుతున్నరు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపాలంటే సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరపడం అనివార్యంగా భావిస్తున్నారు. అందుకే జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.రెండవ రంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే వకాశం ఉంది.

మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్ ఇస్తారంటూ కాంగ్రెస్ నేతల్లో నే చర్చ సాగుతుంది .

షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికలు నిర్వహిస్తే

ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరిగే లే ఏర్పాట్లు చేయనున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments