నిజామాబాద్ జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను వ్యాపారంగా చేసి ఆఫర్లంటూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. 30 నుంచి 50 శాతం రాయితీ పేరిట ప్రలోభాలకు గురిచేస్తున్నాయి.
తమ పిల్లలను ఉన్నత భవిష్యత్తుకు తపిస్తూ మంచి పాఠశాలల్లో చదివించాలని తల్లిదండ్రులు పడుతున్న ఆరాటాన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ పాఠశాలలు అడుగడుగునా దోచుకుంటున్నాయి. లక్షల రూపాయల ఫీజులు కట్టలేక విద్యార్థులు,తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులతోపాటు అడ్మిషన్ ఫీజులు,ఇతర ఫీజుల పేరిట అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయనున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికార యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది.అధిక ఫీజులు నియంత్రించడంలో జిల్లా విద్యాశాఖాధికరులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల్లో అడ్డగోలుగా దోపిడీ కొనసాగుతుంది. ఇష్టా రాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలపై ఉక్కు పాదం మోపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.