- బకాయిలు చెల్లించాలని మధ్యాహ్నమే నోటీసులు……యండి ఫై తీవ్ర వ్యాఖ్యల ఫలితమే ?
జాన రమేష్ : ఇది సంగతి:
ఆర్మూర్ ;ఆర్టీసీ యండి ఫై మాజీ ఎమ్మెల్యే బిఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి వ్యాఖ్యల ఫలితంగా ఆయనకు చెందిన మాల్ విషయంలో ఆర్టీసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. షాపింగ్ మాల్ బకాయి లు చెల్లించాలంటూ గురువారం మధ్యాహ్నమే నోటిసు లు ఇచ్చిన ఆర్టీసీ అధికారులు సాయంత్రమే భారీ పోలీసు బలగాలతో రంగంలోకి దిగి షాపింగ్ కు ప్రజలను వ్యాపారులను సైతం బయటికి పంపేసి మెయిన్ గెట్ కు తాళం వేశారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీ కీలక నేతలు పావులు కదిపారు అయనకు చెందిన జీవన్ మాల్ బకాయిలు చెల్లించాలని మొదటి నోటీసులు ఇచ్చారు. దీనిపై న్యాయ పోరాటానికి జీవన్ రెడ్డి సిద్ధం అయ్యారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి జీవన్ మాల్ కు వెళ్లి మరోసారి బకాయి ల నోటీస్ లు ఇచ్చారు.దీనిపై జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లతో కలసి ఆర్టీసీ యండి ఫై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సజ్జనార్ అత్యంత అవినీతి పరుడంటూ దుయ్యబట్టారు.
అదే వేదిక ఫై మొన్నటి దాక ఆర్టీసీ సంస్థ కు ఛైర్మెన్ గా పనిచేసిన బాజిరెడ్డి మాత్రం సజ్జనార్ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.అయితే జీవన్ రెడ్డి ఆరోపణలను ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అయిన రెండో రోజే రంగంలోకి దిగారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ కు తాళం వేశారు, ఉదయమే జీవన్ మాల్ లోకి వచ్చిన ఆర్టీసీ అధికారులు సాయంత్రం లోగా దుకాణాలను ఖాళీ చేయాలని ప్రకటించారు.
ప్రకటించిన విధంగానే సాయంత్రం మాల్ లో ఉన్న వారిని బయటకు పంపి ప్రధాన గేటుకు తాళం వేసి సీజ్ చేశారు. గత వారం క్రితం ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని అధికారులు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్టిసి ఎండి సజ్జనర్ పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆపైన ఆర్టీసీ అధికారులు జీవన్ మాల్ గేటుకు మాల్ తమ స్వాధీనంలో ఉందని హెచ్చరిక తో కూడిన ఫ్లెక్సిని అతికించారు.
