తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు లోని మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్ పోస్టు లో ఏసీబీ గురువారం తెల్లవారు జామున మెరుపు దాడులు చేసింది.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక బృందం సలాబత్ పూర్ చెక్ పోస్టు లో రవాణా శాఖ కు చెందిన అధికారులను అదుపులోకి తీసుకోని వారుండే గది క్షుణ్ణంగా సోదాలు చేసారు.
రవాణా శాఖ అధికారులపక్షాన పనిచేస్తున్నఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను సైతం తనిఖీ చేసారు. సుమారు 50 వేల రూపాయల నగదు లభ్యం అయినట్లుగాసమాచారం.
