HomePOLITICAL NEWSUncategorizedప్రభుత్య ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వినయ్...

ప్రభుత్య ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను కలియతిరిగి రోగులతో మాట్లాడి వైద్యులకు తగు సూచనలు చేశారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సూపరిండెంట్ శ్రీనివాస్ కు పలుసూచనలు చేశారు.

వివిధ సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అన్నారు. ఆసుపత్రి పలు రిజిస్టర్లు పరిశీలించారు. అత్యవసర విభాగం సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలన్నారు. మందుల స్టాక్ గురించి అడిగి తెలుసుకున్నారు.

రోగులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యంకు అవసరమైన మిషన్ లు, కావలసిన అవసరాలైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రాజశ్రీ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శివ ప్రసాద్, డాక్టర్ నాగమోహన్, డాక్టర్ రాజశేఖర్, మెడికల్ కళాశాల ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments