HomeTelanganaNizamabadఫోన్ ట్యాపింగ్ విచారణ సిబిఐ కి అప్పగించాలి..తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేపడితే...

ఫోన్ ట్యాపింగ్ విచారణ సిబిఐ కి అప్పగించాలి..తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేపడితే పూర్తి స్థాయిలో న్యాయం జరగదు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్..

ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐ కి అప్పగించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐ దర్యాప్తు చేపట్టి విచారించాలని పదే పదే డిమాండ్ చేశారని అన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐ దర్యాప్తు చెప్పటాలని ఉత్తరాలు రాసారు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నందున దోషులకు శిక్ష పడేవిధంగా సీబీఐ దర్యాప్తు చేపడితే బాగుంటుందని సూచించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.పోలీస్ వ్యవస్థలో ఓ భాగమే ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపించారు.

పోలీస్ వ్యవస్థ మీద ఇప్పుడున్న పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తే ఎన్నిరకాల ఇబ్బందులు ఎదురవుతాయో అందరికి తెలిసిందేనని అన్నారు.తెలంగాణ పోలీసుల మీద తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేపడితే పూర్తి స్థాయిలో న్యాయం జరగదని అన్నారు.

అందుకే సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, బిఆర్ఎస్ పార్టీ తో కమ్ముకు కాలేదని భావిస్తే సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీబీఐ కి అప్పగించాలని హై కోర్టులో కూడా బిజెపి అధికార పూర్వకంగా పిటిషన్ వేశామని తెలిపారు.రాజకీయ కారణాలతో గానీ,బిఆర్ఎస్ పార్టీ తో కమ్ముకుఅయ్యినందున దర్యాప్తు కు ఆదేశించాక పోతే హై కోర్టు ముందు మా వాళ్ళని పిలిపిస్తామని పేర్కొన్నారు.

గత టిఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తుల యొక్క ఫోన్లు, రాజకీయ నేతల మీద,వ్యాపారస్తుల, సినీ నటుల పైన,మీడియా ఎడిటర్, ప్రతినిధుల ఫోన్లో కూడా ట్యాపింగ్ చేసిందని తెలిపారు.

అందుకే మాకు మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం పై అనుమానం ఉండడంతోనే హైకోర్టు కు వెళ్ళామన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ టాపింగ్ ద్వారా తొంగి చేశారని తెలిపారు.దేశంలో ఎక్కడైనా ట్యాపింగ్ జరిగితే కమిటీలు ఉంటాయని తెలిపారు.

ఇది ఒక సదసీద కేసు కాదు కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు.29 న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభానికి అమిత్ షా రాక.

జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఈ నెల 29న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని కిసాన్ రెడ్డి పేర్కొన్నారు.పసుపు బోర్డు కార్యాలయం ప్రారం భంతో ఇందూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరనుం దని పేర్కొన్నారు.

ఇకనుంచి రైతులు నూతన శకం మొదలవుతుందని అభిప్రాయపడ్డారు. ఇందూరు ప్రజల కోరిక మేరకు ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పసుపు బోర్డు తెచ్చారని గుర్తు చేశారు.

కేంద్ర పసుపు బోర్డు ఏర్పాటు ఒక ఎత్తైతే కార్యాలయం కోసం పక్కనే ఉన్న మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఫస్ట్ బోర్డు కార్యాలయాన్ని తమ రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని చెప్పిన కానీ ఎంపీ అరవింద్ కృషి మేరకు నిజామాబాద్ గడ్డపైనే ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం అని అన్నారు.

అదే విధంగా పసుపు బోర్డు చైర్మన్ కూడా నిజామాబాద్ రైతు బిడ్డను చేయడం అభినందించారు. పసుపు బోర్డు ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ బహుమతి అని చెప్పారు. రైతు ఉద్యమానికి కేంద్ర బిందువు నిజామాబాద్ జిల్లా అని కొనియాడారు.

గ్రామ గ్రామాన రాజకీయాలకు అతీతంగా రైతులు సంఘాలుగా ఏర్పడి సమస్యలపై పోరాడి అన్ని రైతు సంఘాల వర్గాలు ఈ బహిరంగ సభకు పాల్గొంటున్నారని ఆయన అన్నారు. పసుపుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు.

ఈ కార్యక్రమం రైతు జీవితంలో నింపాలని అన్నారు. భవిష్యత్తులో బోర్డు ద్వారా రైతులకు నిరుద్యోగులకు ఉపాధి అందిస్తున్నాను భావించారు. రాజకీయాలపాతీతంగా పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా మద్దతు ధర వచ్చే విధంగా అన్ని వర్గాల వరకు చేయాలని కోరారు.

అలాగే 29న ధర్మపురి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపారు.ఈ బహిరంగ సభలో రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావాలని కోరారు. అనంతరం పసుపు బోర్డు కార్యాలయ్యాని సందర్శించారు.

కిషన్ రెడ్డి, బహిరంగ సభ జరిగే పాలిటెక్నిక్ మైదానం ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, దినేష్ కులచారి, స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments