HomeTelanganaNizamabadనిజామాబాద్‌లో అమరవీరుడు డివి కృష్ణ మూడో వర్ధంతి సభ

నిజామాబాద్‌లో అమరవీరుడు డివి కృష్ణ మూడో వర్ధంతి సభ

ఘనంగా నిజామాబాద్ పట్టణం ఆకుల పాపన్న రోడ్ వద్ద ఉన్న అమరవీరుల స్మారక స్తూపం వద్ద బుధవారం రోజున విప్లవ వీరుడు డి.వి. కృష్ణ మూడో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ,”డి.వి. కృష్ణ అనుసరించిన విప్లవ మార్గం, కార్మిక రైతుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శప్రాయమని” కొనియాడారు. ఆయన త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు,వి.కృష్ణ ,ఎం.నరేందర్,,ఎం.వెంకట్,,డి.రాజేశ్వర్ ,ఎం.సుధాకర్, ఇతర సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కార్యకర్తలువారు డివి కృష్ణ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. విప్లవ గీతాలతో, నినాదాలతో ప్రాంతమంతా మార్మోగిపోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments