తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండరీ గంగాధర్ మాట్లాడుతూ. నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6-7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు భవన నిర్మాణరంగాల కార్మికుల గురించి ఇంతవరకు కార్మిక శాఖ మంత్రిని కేటాయించకపోవడం అనేది బాధాకరమని ఎద్దేవ చేశారు.
గత మాజీ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఇకనైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి గారు కొన్ని సంక్షేమ పథకాలను పెంపొందించారని , అనంతరం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా ఎన్నో సంక్షేమ పథకాలను పెంపొందించి కార్మికులకు అందించాని ఆదేశాలు జారీ చేశారు.కానీ ఇంతవరకు అటు వైపు చర్యలు కూడా తీసుకొనదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కార్మికులకు పెన్షన్లు గానీ, ఈఎస్పి ఆసుపత్రులు గానీ, ఇళ్లు లేని వారికి ఇండ్లు, మండలాలు, జిల్లాల వారీగా కార్మిక సంఘాలకు భవనాలు కట్టి ఇవ్వాలని, ప్రతి ఒక్క లేబర్ కార్డు ఉన్న కార్మికుడికి 60సం||లలోపే తొలగించడం జరుగుతుందని,కాబట్టి ఇట్టి కార్డు సదుపాయాన్ని బ్రతికినంత కాలం కల్పించాలని TFTU, BNRKS డిమాండ్ చేస్తున్నాయి.
అదేవిధంగా ఈ విషయంపైనా తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ , బోర్డు సెక్రటరి, ఉప కమిషనర్ కు గత 30వ తేదీన వినతిపత్రం సమర్పించమని పేర్కొన్నారు. గడిచిన నెలరోజులుగా ఇట్టి విషయమై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ద్వజమెత్తారు.
కార్మిక శాఖ అధికారులు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్మికులు, మహిళ కార్మికులు పాల్గొన్నారు.