జిల్లా కమిషనర్ కల్మేశ్వర్, ట్రాఫిక్ ఏసిపి నారాయణ ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని ట్రాఫిక్ పోలీసు లు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆధారాలు లేని వాహనాలను,
ట్రిబుల్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలను, నాసిరకం రిజిస్ట్రేషన్ ప్లేట్‌లతో వాహనాలు, పెండింగ్ చలాన్ ఉన్న వాహనాలను నడిపే వారిపై తనిఖీలు నిర్వహించి 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సుమన్ తెలిపారు.
ఈ తనిఖీలో ట్రాఫిక్ పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.