మాదక ద్రవ్యాలతో యువత జీవితాలు నాశనమవుతాయని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ నగర రెండవ టౌన్ ఎస్ఐ రామ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరం లోని ఖిల్లా రోడ్డులో, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్తు పదార్థాల నియంత్రణ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్దులు, యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని కోరారు. మాదకద్రవ్యాలు వల్ల యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. మద్యం, గంజాయి,గుట్కా,మట్కా, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
సమాజంలో ఒక వ్యక్తి చెడు వ్యసనాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు, స్నేహితులు ఎప్పటికప్పుడూ వారిలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రాథమిక స్థాయిలో గుర్తించినట్లతే వాటి బారి నుంచి వారిని కాపాడ వచ్చన్నారు.
ప్రస్తుత రోజుల్లో అన్ని ప్రాంతాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా కావడంలో నేడు ఇది సామాజిక సమస్యగా పరిగణించ బడుతోంది. ఇలాంటి సామాజిక సమస్యను రూపుమాపడంతో అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావల్సి వుంటుందని ఇందులో భాగంగా ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా ఎవరైనా, తల్లిదండ్రులు గమనిస్తే, వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.
సమాచారం అంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కావున గంజాయి రహిత ప్రాంతంగా గుర్తింపబడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.
అంతేకాకుండా ప్రతి ఒక్కరు డయల్ 100 వంటి వాటిపైన అనే అవ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వారి మీద PD పిడీ యాక్ట్ పెట్టడంతోపాటు రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని ఎస్ఐ రామ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.