గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.
ఓమయ్య మాట్లాడుతూ.. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో
జులై 3న వైద్య శాఖ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా, జిల్లా కేంద్ర ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ను శుక్రవారం కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, ఆర్థిక సెలవులు ఇస్తామని అధికారులు రాతపూర్వకంగా హామీ ఇచ్చిన అమలుపరచలేదని,ఈ సమస్యల పరిష్కారానికై జూలై 3 న హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు హైమది బేగం,భాగ్యలక్ష్మి, కవిత, రోజా పాల్గొన్నారు.