దిగ్గజ నేత మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ( 75) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోని తన నివాసంలో నే మృతి చెందారు.
తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. ఆయన కు ఇద్దరు కొడుకులున్నరు.
పెద్దకొడుకు సంజయ్ మాజీ మేయర్ రెండో కొడుకు అర్వింద్ నిజామాబాద్ ఎంపీ గా పనిచేస్తున్నారు.
ఆయన గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రియాశీల రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆయన రాజ్య సభ ఎంపీ గా పనిచేసారు.
మూడు సార్లు ఎమ్మెల్యే గా ఓ సారి ఎమ్మెల్సీ గా పనిచేసారు నలుగురు సీఎం ల క్యాబినెట్ లలో ఆయన మంత్రిగా పనిచేసారు .
/// // యన్ యస్ యు ఐ నుంచే ఎంట్రీ //////
యన్ యస్ యూ ఐ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన డీఎస్ ఆనతి కాలం లోనే ఎమ్మెల్యే గా మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ గా పనిచేసారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో 1948 సెప్టెబర్ 27న జన్మించన ఆయన హైదారాబాద్ లోనే విద్యాబ్యాస్యం చేసారు. నిజాం కాలేజీ డిగ్రీ పూర్తీ చేసారు.
ఆ తర్వాత న్యాయ విద్యను అభ్యసించారు. మొదట హైదారాబాద్ లోనే ఆర్బీఐలో ఉద్యోగం లో చేరారు. రాజకీయాల్లో విద్యార్థులు రావాలంటూ దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపుమేరకు విలువైన ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు అప్పటి బాల్కొండ ఎమ్మెల్యే మంత్రి అర్గుల్ రాజారాం ను సంప్రదించి ఆయన ప్రోత్సహం తో కాంగ్రెస్ లోకి వెళ్ళాడు.
డీఎస్ వాక్ చాతుర్యం తో అబ్బుర పడిన ఇందిరా ఆయన్ను ఉమ్మడి ఏపీ యన్ యస్ ఐ యూ మొదటి అధ్యక్షుడిగా నియమించారు.
1981 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆతర్వాత 1983 శాసన సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయారు.
నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1999, 2004లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మొదట మర్రి చెన్నారెడ్డి, క్యాబినెట్ లో ఆబ్కారీ మంత్రిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, క్యాబినెట్ లో పట్టు పరిశ్రమ స్వయం ఉపాధి కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డిల క్యాబినెట్‌లలో పనిచేశారుఉన్నత విద్యా గ్రామీణ అభివృద్ధి శాఖ ల మంత్రి గా పనిచేసారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా అధికారంకు దూరం అయింది.
పీసీసీ ఉపాధ్యక్షుడి గా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనూ 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచారు.
అందుకే ఆయన్ని కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా డీఎస్ ను 2004,లో పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది.
ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధిష్టానం అంచనాలకు తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వై యస్ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి అవుతారని భావించారు.
కానీ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత గ్రామీణ అభివృద్ధి శాఖ చూసారు.
పార్టీ రెండో సారి అధికారంలోకి రావడం అనివార్యంగా భావించిన అధిష్టానం డీఎస్ ను పీసీసీ అధ్యక్షుడిగా 2009 మరోసారి నియామకం చేసింది.
కాంగ్రెస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చింది.కానీ నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో పోటీ చేసిన డీఎస్ ఓడిపోయారు. దీనితో అధికారం కు దూరం అయ్యారు.
వై యస్ చనిపోయాక రోశయ్య తాత్కాలిక సీఎం అయ్యాక నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ కు అనూహ్యంగా ఉప ఎన్నిక వచ్చింది.
కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతుండడంతో తెలంగాణ కు చెందిన దిగ్గజనేత డీఎస్ ను సీఎం చెయ్యాలనే ఆలోచనతో ఆయనను మరోసారి పోటీ కి దింపింది.
కానీ ఓటమి తప్పలేదు . 2004లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రీయాశీలక పాత్ర పోషించారు..
/// సోనియా తో నేరుగా కలిసే చనువు ////
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించిన డీఎస్ గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో నేరుగా కలిసే చనువు ఆయన సొంతం. అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీ, లాంటి నేతలతో దగ్గరి దోస్తాని ఉంది. కానీ దిగ్విజయ్ సింగ్ ,గులాబీ నబీ ఆజాద్ లాంటి నేతలు ప్రతికూలంగా పనిచేసారు..
//// కాంగ్రెస్ కు దూరం చేసింది ఎమ్మెల్సీ////
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో అందులోనూ గాంధీ కుటుంబానికి విధేయుడి గా ఉన్న డీఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారమే కాంగ్రెస్ పార్టీ ని వీడేలా చేసింది.
పీసీసీ అధ్యక్షుడిగా రెండు సార్లు సక్సెస్ ఫుల్ గా పనిచేసిన ఖ్యాతి పొందిన డీఎస్ 2009 ఎన్నికలో ఓడిపోవడంతో అధిష్ఠానం ఆయన మీద అంతులేని సానుభూతి చూపెట్టింది.
2010 ఉప ఎన్నికల్లో పోటీ కి దింపింది.చివరికి 2013 లో రోశయ్య స్థానం లో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది.కానీ పదవీ కాలం 2015వరకే పూర్తీ అయింది . తెలంగాణ ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా డీఎస్ పనిచేశారుకానీ .
ఎమ్మెల్సీ పదవీ కాలం పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తి ని అధిష్టానం ఏ మాత్రం పట్టించుకోలేదు పైగా ఆయన అనుచరులు గా ఉన్న ఆకుల లలిత కు ఎమ్మెల్సీ పదవీ కట్టబెట్టారు .
దీనితో మనస్తాపం చెందిన ఆయన అనేక సార్లు సోనియా గాంధీ ని కలవడానికి ప్రయత్నాలు చేశారు.
కానీ ఆమె అపాయింట్మెంట్ కూడా దొరక లేదు. దీనితో ఆయన తదుపరి రాజకీయ ప్రస్థానం అగమ్య గోచారంగా మారడంతో 2015లో కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.
తెరాస అధినేత కెసిఆర్ సైతం అనేక సార్లు ఒత్తిడి చేసారు.
కుటుంబ సభ్యులతో సహా డీఎస్ ఇంటికి వెళ్ళి ఆయను పార్టీలోకి ఆహ్వానించారు. మొదట ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా క్యాబినెట్ హోదా పదవి కట్టబెట్టారు.
ఆ తర్వాత రాజ్య సభ పదవీ ఇచ్చారు. ఎక్కువగా కాలం ఆయన ఆ పార్టీలో ఇమడ లేక పోయారు.
/// పొమ్మనలేక పొగ బెట్టారు ////
అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ కార్యకలాపాలు సాగించిన డీఎస్ అనివార్యపరిస్థితుల్లో తెరాస లో కి వచ్చారు. అధినేత కెసిఆర్ కీలక పదవులే కట్టబెట్టారు.
కానీ జిల్లాలో ఎంపీ కవిత తీరు డీఎస్ ను ఇబ్బందులకు గురి చేసింది.
ఆయన మాట చెల్లుబాటు కాకుండా ఆమె కట్టడి చేయడం డీఎస్ జీర్ణించుకోలేక పోయారు. మరో వైపు ఆయన చిన్న కొడుకు అర్వింద్ 2018 బీజేపీ లో ఎంట్రీ ఇచ్చారు.
డీఎస్ అర్వింద్ ను తెరవెనుక నుంచి ప్రోత్సహిస్తూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ ఎమ్మెల్యే లతో కల్సి కవిత కెసిఆర్ కు పిర్యాదు చేసారు.
ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనితో ఆయనే పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు.