మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీమంత్రి డి.శ్రీనివాస్.పార్ధివ దేహాన్ని ఈరోజు ఉదయం 9గంటలకు ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించారు.
పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ సూచనతో డీఎస్ పార్థివదేహం ను మధ్యాహ్నం 2గంటల కు గాంధీ భవన్ కు తరలిస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తల సందర్శనార్థం ఉంచనున్నారు.
శనివారం రాత్రి నిజామాబాద్ నగరంలో ని ప్రగతి నగర్ లోని ఆయన సొంత ఇంటికి తీసుకొస్తారు.
ఆదివారం మధ్యాహ్నం నగరంలో బై పాస్ రోడ్డు లో ఆయన సొంత భూమి లోనే అంతక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డిఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి మధ్యాహ్నానికల్లా హైదరాబాద్ చేరుకుంటారు..
