ఇది సంగతి: ఆర్మూర్: దేశరాజధాని ఢిల్లీలో కేంద్రమంత్రి తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పైలెట్ ప్రాజెక్టును ఆర్మూర్ నియోజకవర్గానికి కేటాయించాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని రాకేష్ రెడ్డి కోరారు.
అయినప్పటికిని ఆర్మూర్ కు కేటాయించాలని కోరిన ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పైలెట్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లా మధిర కు కేటాయించారని అన్నారు. ఇకనైనా మూడవ పైలెట్ ప్రాజెక్టును ఆర్మూర్ నియోజకవర్గానికి కేటాయించాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే విషయంలోనే త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు.