ఇందూర్ నగరం :భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికసమావేశంలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మాట్లాడుతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన గాలికి వదిలేసి, ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడని, ముఖ్య మంత్రి సిటు కాపాడుకోవడం కోసం గడిచిన ఆరు నెలలలో 11 సార్లు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ చుట్టూ తిరగడానికే సరిపోయిందని,
గత ప్రభుత్వం చేసిన విధ్యుత్ కొనుగోలు కుంభకోనం, కాళేశ్వరం కుంభకోనం, గొర్రెల పంపిణిలో కుంభకోనం, ఫోన్ టాపింగ్ కుంభకోనల నుండి కెసిఆర్ ను కాపాడటానికి, BRS ను కాంగ్రెస్ లో విలీనం చేయడానికి సోనియాతో రేవంత్ పావులు కదుపుతున్నారని,కీలకమైన శాఖలను రేవంత్ తన దగ్గర పెట్టుకొని విద్యరంగ సమస్యలు గాలికి వదిలి ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలికసౌకర్యల కల్పించలేని దుస్థితి ఉందని,
ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న వాటిపై చర్యలు లెవని, రేవంత్,బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేట్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని మరి మన నియోజకవర్గంలో నేటికీ కనీస మౌలిక సౌకర్యాల కల్పన లేదని,ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తే పోలీసులు నా ఏబీవీపీ కార్యకర్తల పైన దాడి చేసి కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు,
పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ కి గులాంగిరి చేస్తే అంటే జిల్లా విడిచిపెట్టి వెళ్ళండి అని హెచ్చరించారు,రేవంత్ హోం శాఖను దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రత పైన దృష్టి పెట్టకుండా ప్రశ్నించే గొంతును అణచివేయాలని చుస్తే ఊరుకోమన్నారు,
నిజామాబాదు జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణ రావు సొంత జిల్లాలో చెంచు మహిళను అతికిరతకంగా మానభంగం చేసిన పరిస్థితి రాష్ట్రంలో లా & ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉందంటే మూడు హత్యలు,ఆరు మానభంగాలు అన్నట్లు ఉందని,పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ద ప్రజలపైన /పాలన పైన ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు,
100 రోజుల్లో అమలు చేస్తానన్నాని గద్దెనెక్కిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ ఆరు నెలలు గడుస్తున్న ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు చేయాలేదని,రైతులు వానాకాలం పంటకు సిద్ధం అవుతున్న ఇప్పటివరకు రైతు భరోసా పై క్లారిటీ లేదని పంట బోనస్ 500 గ్యారంటీకి దిక్కే లేదని ఏద్దేవా చేసారు,
రైతు రుణమాఫీ అని చెప్పి కాలయాపన చేస్తూ రైతులను మబ్బేపెడుతున్నారని రుణమాఫీకి ఎటువంటి షరతులు లేకుండా ఏక కాలంలో రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేయాలనీ భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేసారు.
నియోజకవర్గాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన పాపానపోలె అని మాన ఇందూర్ అర్బన్ నియోజకవర్గనికి రేవంత్ ఇచ్చింది గాడిద గుడ్డు అని ఏద్దేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నా అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిలిపివేసిందన్నారు,
MIM పార్టీ అధినేత ఒవైసీ పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తినా అనడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తుందన్నారు,ఈ దేశ రాజ్యాంగాన్ని అవహేళన చేసిన ఒవైసీ క్షమాపణ చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మునిసిపల్ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.