- జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పీవీ నర్సింహారావు గారు చేసిన ఎన్నటికీ మరులేనివని మానాల మోహన్ రెడ్డి గారు తెలిపారు.ఈ రోజు కాంగ్రెస్ భవన్ నందు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
- ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు పాల్గొన్నారు
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నర్సింహారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా,దేశ ప్రధానిగా ప్రజలకు చేసిన సేవలు,సంస్కరణలు ఎన్నటికీ మారువలేనివని,భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందాలని చూసిన కార్యక్రమం దేహాంలోనే ఆదర్శంగా నిలిచిందని,దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభినంగా ఉన్న సమయంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన పీవీ నరసింహారావు గారు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు.
ప్రజలు బాగుండాలంటే పాలకులు ఈ విధంగా వుండాలో అని చూయించిన వ్యతి పీవీ నరసింహారావు గారు అని ఆయన అన్నారు.పీవీ నర్సింహారావు గారి ఆశయాలను,ఆలోచనలు యువత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ పీవీ నర్సింహారావు గారికి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి,కేశ రాజు,సాయి కిరణ్,నిఖిల్, మరియు తదితరులు పాల్గొన్నారు.