20 రోజుల క్రితం పనులు నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి నిర్మానుష్య ప్రాంతంలో ఉరి వేసుకుని మృతి చెంది కనిపించిన ఘటన మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.
మాక్లూర్ మండలంలోని మదనపల్లి గ్రామానికి చెందిన మెగావత్ ప్రకాష్(20). ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా మానసికస్థితి సరిగ్గలేక ఇంట్లోనే ఉంటున్నాడు.

మానసికస్థితిలో ఈ నెల 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దీనితో వెళ్ళిన కుమారుడు తిరిగి ఇంటికి రాలేదని ఆవేదన చెందారు. దాంతో సదరు వారు స్థానిక పోలిస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
ఈ మేరకు గురువారం సాయంత్రం అమ్రాద్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అతని ద్విచ్రక వాహన కనిపించడంతో అతని ఆచూకీ కోసం కుటుంబీకులు వెతికారు.శుక్రవారం ఉదయం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందినట్లు కనిపించాడు.
దీంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.స్థానికుల మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుదీర్ రావు వెల్లడించారు.