ఇప్పటికే లక్ష కోట్లకు పైగా నిధులను ఒక్క వ్యవసాయ రంగానికి ఖర్చు చేసిన విషయాన్ని గుర్తిచేశారు. సంక్రాంతి నుండి సబ్సీడీ పై వ్యవసాయ యంత్రపరికలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైందన్నారు.
రెండు రోజుల క్రితం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సమయంలో చాలా విషయాలు కమిషన్ బృందంతో చర్చినట్లు తెలిపారు. కమిషన్ పనితీరు బాగుందని, అనుకున్న దానికంటే అద్భుతంగా పనిచేస్తున్నట్లు సీఎం చెప్పినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు కమిషన్ పర్యటన చేపట్టి పంట మార్పిడి పై రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
అవసరమైతే కమిషన్కు అదనపు నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు, తృణధాన్యాలు, పప్పుదినుసుల సాగు చెప్పేలా కమిషన్ చొరవ తీసుకోవాలని కోరారు.
ములుగు, గద్వాల్ రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో కమిషన్ తీసుకున్న చొరవ, క్షేత్ర స్థాయి పర్యటనలు అద్బుతమన్నారు. ఇక సాంప్రదాయ పంటలైన చెరుకు, పసుపు, బత్తాయి సాగు విస్తీర్ణం పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
