వ్యవసాయ యూనివర్సిటి ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నే ఏర్పాటు చెయ్యబోతున్నారు. సారంగాపూర్ శివారు లో బీఇడీ కాలేజీ ప్రాంగణం లోనే యూనివర్సిటి ఏర్పాటుకు కసరత్తులు జరుగుతున్నాయి.
ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. జిల్లాకు వచ్చిన ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి సైతం శనివారం స్వయంగా వెళ్ళి ప్రాంగణాలను పరిశీలించారు. సారంగాపూర్ లో షేర్ పూర్ శివారు లో తెలంగాణ యూనివర్సిటీ కి గతంలోనే 50 ఎకరాల భూములు ప్రభుత్వం కేటయించింది.
ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ బీఈడీ ,ఎమ్ఈడీ కోర్స్ లను నిర్వహిస్తుంది. ఈ ప్రాంగణంలో ఉండే టీచింగ్- నాన్ టీచింగ్ ఉద్యోగులు మొక్కుబడిగా క్యాంపస్ కు రావడం వల్ల అక్కడి విద్యావ్యవస్థ దారి తప్పింది యూనివర్సిటి అధికారులు సైతం ఆ వైపు ఎన్నడూ కన్నెత్తి చూడరని విమర్శలున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు వ్యవసాయ యూనివర్శిటి ని మంజూరు చేసింది ఈ వ్యవహారంలో సుదర్శన్ రెడ్డి చొరవ చూపెట్టారు. జిల్లాకు యూనివర్సిటి మంజూరి చేసిన ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది స్పష్టం చేయలేక పోయింది.
ఆ బాధ్యత కూడా సుదర్శన్ రెడ్డి తీసుకున్నారు. ఇందులో భాగంగా మొదట తెలంగాణ యునివర్సిటీ భూముల్లోనే వ్యవసాయ యూనివర్సిటీ ఉండలేని భావించారు
కానీ ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వ్యవసాయ యూనివర్సిటి చేస్తే మెయిన్ ప్రాంగణం కూడా ఇరుకుగా మారె అవకాశం వుంటుందనే ఆలోచనతో సారంగాపూర్ లో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ తెరమీదికి వచ్చింది
ఈ ఏడాదే వ్యవసాయ యూనివర్సిటీ అందుబాటులోకి రావాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఉన్నపలంగా బిఈడీ యం ఈడీ కాలేజీ భవనాలను స్వాధీనం చేసుకోవడం అనివార్యం అయింది.
