Tuesday, January 20, 2026
HomeEditorial Specialకాంగ్రెస్ లో జూబ్లీ జోష్ ......లోకల్ వార్ పైనే ఆశలు .....

కాంగ్రెస్ లో జూబ్లీ జోష్ ……లోకల్ వార్ పైనే ఆశలు …..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ విజయం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. బిఆర్ యస్ సిట్టింగ్ స్థానం లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం క్యాడర్ ను మరింత ఉత్సహం నింపింది.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీ మంచి బూస్టప్ గా భావిస్తుంది. ప్రజాక్షేత్రంలో పార్టీకి ప్రాబల్యం ఎలా ఉంది ఈ ఫలితాలు స్పష్టం చేసి నట్లు అయింది.

ఇదే ఊపు లో లోకల్ ఎన్నికలు వస్తే ఫలితాలు ఏక పక్షంగా ఉంటాయనే ధీమా ఇప్పుడు క్యాడర్ వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తరవాత అధికారంలోకి రావడంతో కింది స్థాయి నేతల్లో పదవుల ఆశలు మొదలయ్యాయి. ఏళ్ల తరబడిగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తన్న కింది స్థాయి నేతలకు నామినేటెడ్ పందేరంలో ను మొండి చెయ్యి చూపారు.

కనీసం లోకల్ బాడీ ఎన్నికల్లో నైన అదృష్టం పరీక్షించుకోవాలనే పట్టుదలతో వుంటూ వచ్చారు. సర్పంచ్ మొదలు యంపిటిసి ,జెడ్పిటిసి, సింగిల్ విండో ,సాగునీటి సంఘాలలకు ఎన్నికలు వస్తే తాము ఎక్కడో ఒకచోట సర్దు బాటు అవుతామని ఆశలు పెట్టుకొని ఉన్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తీ కావొస్తుంది అయినా ఏ ఎన్నిక ఇంకా ముందుకు రాకపోవడంతో క్యాడర్ లీడర్ లలో సహజంగానే అసహనం వ్యక్తం అవుతుంది. జిల్లాలో ఒక్కో నియోజకవర్గం లో కనీసం 40 నుంచి 50 మంది కి పదవులు దక్కే ఛాన్స్ ఉండే. నిజానికి పదేళ్లు బిఆర్ యస్ పార్టీ అధికారంలోకి ఉండడడంతో ఆయా పదవుల్లో గులాబీ నేతలే వుంటూ వస్తున్నారు.

చురుకు గా ఉండే నేతలు కాంగ్రెస్ ను వదిలేసి అధికార యావ లో గులాబీ పార్టీ లోకి వెళ్లారు దీనితో కిందిస్థాయి లో పార్టీకి బలమైన నేతలే లేకుండా పోయారు దీనికి తోడు జిల్లాలో రెండే నియోజకవర్గాల్లో నే ఆ పార్టీకి ఎమ్మెల్యే లున్నారు ఉన్న ఇద్దరు ఎమ్మెల్యే లు కూడా కింది స్థాయిలో పార్టీ నిర్మాణం ను గాలికి వదిలేసారు.

అందుకే ఒక్కసారి లోకల్ వార్ వస్తే సర్పంచ్ యంపిటీసి జెడ్పిటిసి సింగిల్ విండో డైరెక్టర్ లాంటి పదవులు దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యం అవుతుంది. ఎమ్మెల్యే లు నియోజకవర్గ ఇంచార్జ్ లు తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులనుగెలిపించడానికి సర్వ శక్తులు ఒడ్డక తప్పదు.

అందులోనూ ప్రభుత్వ పాలన ఉందనడానికి ప్రతీకగానే జూబ్లీహిల్స్ ఫలితం రావడంతో కింది స్థాయి నేతల్లో లోకల్ వార్ ఆశలు చిగురించాయి. ఇదే ఊపు లో ఎన్నికలు వస్తే తాము సునాయాసంగా గట్టెక్కు తామని చెప్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!