అహల్య భాయ్ హోల్కర్ 300వ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన గోల్ హనుమాన్ చౌరస్తా నుండి మార్కండేయ మందిరం వరకు నిర్వహించిన ర్యాలీకి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు లోక మాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహిళా నారి శక్తికి నిదర్శనంగా నిలుస్తూ మహిళా సాధికారాతకు ఎనలేని కృషి చేసారన్నారు.ఆమె హిందూ దేవాలయాల నిర్మాణానికి గొప్ప మార్గదర్శకురాలు నిర్మాణకర్త అన్నారు.
అహల్య భాయ్ భారతదేశం అంతటా వందలాది దేవాలయాలతో పాటు ద్వారక నుంచి మొదలుకొని వారణాసి, ఉజ్జయిని, నాసిక్, గయ, వైద్యనాథ్ ఆలయం (మహారాష్ట్ర) వంటి ప్రాంతాల్లో ధర్మశాలలు నిర్మాణం చేశారన్నారు1780లో ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయ పునరుద్ధరణ మరియు మరమ్మత్తు ఆమె అత్యంత ముఖ్యమైన కృషి చేసారన్నారు.
ఆమె తన పాలనలో పక్షపాతం లేకుండా న్యాయ పరిపాలన అందించడంతో పాటు కుల వృత్తులను ప్రోత్సాహించడం జరిగిందన్నారు.విరత్వం అనేది ఈ గడ్డలో పుట్టిన ప్రతి బిడ్డ పుట్టుకతో మన పూర్వికుల ధైర్య సాహసాలను పునికిపుచ్చుకోవడం, వారిని మనం ఆదర్శంగా తీసుకోవడం మనం చూస్తున్నాం అన్నారు.
మన దేశ నారి శక్తి గొప్పతనానికి నిదర్శనంగా ఆనాడు అహల్య భాయ్, ఝాన్సీ లక్ష్మి భాయ్, రాణి రుద్రమ్మ కాలం నుండి మొన్న ఆపరేషన్ సిందూర్ లో ఖురేషి, వ్యోమిక చూపిన తెగువ ఈ దేశం ఎప్పటికి మరువదు అని తెలియజేసారు.
నిన్నటికి నిన్న కాశ్మీర్ LOC వద్ద పాక్ ఉగ్ర దేశం భారీ షెల్లింగ్ కి ప్రయత్నం చేస్తుంటే మన భారత సైన్యం 7 గురు ఆడబిడ్డలు చేసిన దాడికి తోక ముడిచి పారిపోయిన సందర్బం ఈ దేశ నారి శక్తికి నిదర్శనం అన్నారు.
కాబట్టి ఈ దేశ ప్రజలు ఎమర్జెన్సీ విధించి, హిందువులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించి ఈ దేశాన్ని విచ్చిన్నం చేసిన ఇందిరా చరిత్ర కాదు తెలుసుకోవాల్సింది. అహల్య భాయ్, ఝాన్సీ లక్ష్మి భాయ్, రాణి రుద్రమ్మ, ఛత్రపతి శివాజిని తయారు చేసిన జిజియా భాయ్ లాంటి ధీర వనితల చరిత్ర తెలుసుకోవాలి.
వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.నేడు సమాజంలో హిందువులపై జరుగుతున్నా దాడులు, హిందూ దేవాలయాలపై దాడులను హిందువులుగా అందరం సంఘాటీతం అయి ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
