HomeTelanganaNizamabadనరహరి అకాల మరణంతో పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

నరహరి అకాల మరణంతో పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

నవోదయ పూర్వ విద్యార్థి నరహరి అకాల మరణంతో ఆ బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహాయం అందించారు.

సోమవారం రావుట్ల వెళ్లి ఆయనకు మౌనం పాటించి నివాళులు అర్పించి, ఆపదలో ఉన్న తన కుటుంబానికి నవోదయ పూర్వ విద్యార్థులు రూ 50 వేల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.

సిరికొండ మండలం, రావుట్ల గ్రామంలో అనారోగ్య కారణం తో మంగళవారం రోజు చనిపోయిన నవోదయ పూర్వ విద్యార్థి నరహరి గారి కుటుంబానికి తక్షణ సహాయార్థం ఆ బ్యాచ్ మిత్రులు Rs 50,000/- అందించడం జరిగింది.

నవోదయ పూర్వ విద్యార్థుల సంఘం తరుపున అన్ని బ్యాచ్ ల నుండి వచ్చిన ఫండ్స్ తో నరహరి యొక్క ఇద్దరు కుమారులను (ప్రస్తుతం 7వ తరగతి, 4 వ తరగతి ) ఎంత వరకైనా చదివించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ బ్యాచ్ మిత్రులు తెలియజేయడం జరిగింది.

నవోదయ విద్యార్థులు ఒక మంచి ఆలోచనతో ఆ కుటుంబానికి అందించిన సహకారంకు, ఆ గ్రామ విడిసి సభ్యులు & బంధుమిత్రులు నవోదయ పూర్వ విద్యార్థుల సంఘం కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments