వచ్చే వారంలో వెలువడనున్న నోటిఫికేషన్ ..?- ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న లోకల్ లీడర్లు – లోకల్ ఫైట్ కు కౌంట్ డౌన్ ప్రారంభం- కోర్టు గడువులోగా ఎన్నికలు పూర్తి చేయడానికి సర్కార్ రెడీ – బీసీ బిల్లు తేలకుండానే మోగనున్న సమర శంఖారావం
స్థానిక సమరానికి సర్కారు సిద్ధమవుతోంది. దాదాపు రానున్న వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు పూర్తి చేయడానికి హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో మొట్టమొదట పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.
కోర్టు విధించిన గడుపులోగా ఎన్నికలు జరపాలంటే ఈ నెలలో నోటిఫికేషన్ తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేయాల్సి ఉంటుంది.
42 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొవడంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లను అంతే శాతం కేటాయించి పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలో దాదాపు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం వచ్చేవారమే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి స్థానిక ఎన్నికల సమరాన్ని పూరించనున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం ఎన్నికల సంఘం సిద్ధం కాగా. కలెక్టర్లు కూడా సంసిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది ఏమైనా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్థానిక సమరానికి కౌంట్ డౌన్ మొదలైనట్టే అని స్థానికులు భావిస్తున్నారు.
