ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొన్న సంఘటన జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ జాతీయ రహదారి మీద జరిగింది.. స్థానికుల వివరాల ప్రకారం నిజామాబాద్ కు చెందిన ఇంతియాజ్.
శుక్రవారం అర్ధరాత్రి ఎమర్జెన్సీ పేషంట్ ని చికిత్సా నిమిత్తం హైదరాబాద్ కు తీసుకెళ్ళాడు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తున్న సమయంలో డ్రైవర్ ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో తీవ్రా గాయాలు అయ్యాయి.
అనంతరం సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి అక్కడి నుంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.