విలువైన ఆరోగ్యాలను ఫణంగా పెట్టి …రెక్కలుముక్కలు చేసుకొని పనిచేస్తూ …రోడ్లు, మురికి కాల్వలు శుభ్రం చేస్తూ ….కంపుకొట్టే వ్యర్థాలను క్రమం తప్పకుండ డంప్ యార్డు లకు తీసుకెళ్లే సానిటేషన్ సిబ్బంది పేరుతో అధికారులు మున్సిపల్ ఖజానా ను లూటీ చేస్తున్నారు. నెలవారీగావచ్చే మామూళ్ల తో సరిపెట్టుకోలేక పోతున్న మున్సిపల్ అధికారులు సొంత ఖజానా నే యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. వాటాలు చేసుకొని పంచుకుంటున్నారు.
రోజు విధులకు గైర్హాజరు అవుతున్న సానిటేషన్ సిబ్బంది పేరుతొ ఈ లూటీ సాగుతుంది. సుమారు అయిదు లక్షల పై చిలుకు జనాభా ఉన్న నగరంలో పరిశుద్ధ నిర్వహణ ను మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజారోగ్య విభాగం పర్యవేక్షిస్తుంది. కార్పొరేషన్ కు వస్తున్నఆదాయంలో ఎక్కువగా ఈ విభాగం కోసమే వెచ్చిస్తారు. అంతే కాదు వందలాది సిబ్బంది పనిచేసేది కూడా ఇదే విభాగంలోనే నిజామాబాద్ నగరంలో రోడ్లు ఊడ్చడం మురికి కాల్వలు శుభ్రం చేయడం ప్రధాన విధుల్లో చెత్తను వాహనాల్లో డంపింగ్ యార్డు కు తీసుకెళ్లడం పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న వారే చేయాలి.
ప్రతి రోజు ఉదయం నాలుగు గంటల నుంచే కార్యకలాపాలు మొదలవుతాయి. క్షేత్ర స్థాయిలో సిబ్బంది పనిచేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించడానికి మే స్రి లు ఆపై సానిటరీ ఇన్స్పెక్టర్ లుంటారు. వీరి మీద యంయాచ్ వో వుంటారు. నిజానికి నగరం నాలుగువైపుల అంచనాలకు అందనంతగా విస్తరించింది. అందుబాటులో ఉన్న సిబ్బంది తో రోజువారీగా నగరంలో పారిశుధ్య నిర్వహణ కత్తిమీద సామే.
కానీ అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే పారిశుధ్య నిర్వహణ కోసం ప్రతియేటా కోట్లాది రూపాయలను కార్పొరేషన్ వెచ్చింస్తుంది. అదికూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్నదే. పారిశుధ్య నిర్వహణ సౌలభ్యం కోసం నగరం ను ఆరు జోన్ లు గా చేశారు. ఒక్కో జోన్ కు కనీసం 250 నుంచి 300 మంది సిబ్బంది ని కేటాయించారు. ఒక్కో జోన్ లో ఇద్దరేసి సానిటరీ ఇన్స్ పెక్టర్లు ఉన్నారు. వీరు రోజు క్రమం తప్పకుండ ఆయా జోన్ కార్యాలయంకు తెల్లవారు జామునే సిబ్బంది కి అటెండెన్స్ వేయాలి.
ఆ తర్వాత వారెలా పనిచేస్తుంది స్వయంగా చూడాలి. కానీ అవినీతి అలసత్వం వైఖరులు ఈ అధికారుల్లో హెచ్చుమీరాయి. అలసత్వ సంగతి ఎలా ఉన్న పారిశుధ్య సిబ్బంది పేరుతొ వీరు సాగిస్తున్న వసూళ్ల దందా తెలిస్తే ఎవ్వరైనా విస్తు పోవాల్సిందే. ఒక్కో జోన్ లో ప్రతి రోజు కనీసం 15 నుంచి 20 మంది విధులకు గైర్హాజర్ అవుతారు. ఇందులో రెగ్యులర్ సిబ్బంది కి సెలవు వెసులుబాటు వుంటుంది.
కానీ తాత్కాలిక హోదా పనిచేసే వారికి ఎలాంటి వెసులుబాటు వుండదు. గైర్హాజర్ అవుతున్న సిబ్బంది కూడా విధులకు హాజరు అయినట్లుగా అటెండెన్స్ వేసేస్తున్నారు. వారి పేరుమీద కార్పొరేషన్ ఖజానా నుంచి పూర్తీ స్థాయి జీతం డ్రా చేసి గైర్హాజర్ రోజుల జీతం ను తమ జేబులో వేసుకుంటున్నారు. గైర్హాజరు అవుతున్న సిబ్బంది కి సంబందించి జీతం ను వాటాలు వేసుకొని అధికారులు మింగేస్తున్నారు. నిజానికి ప్రతినెలా లక్షలాది రూపాయలు కార్పొరేషన్ సొమ్ము ను అధికారులు గుట్టుగా మింగేస్తున్నారు.
నిజానికి సానిటరీ ఇన్స్ పెక్టర్ రోజు కచ్చితంగా వెళ్లి హాజరు తీసుకోవాలి కానీ వారి కింద ఉండే మె స్రి లే ఈ కార్యం ను పూర్తీ చేస్తున్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పనిచేసే సిబ్బంది విధులకు రాకుంటే వారి వచ్చినట్లుగా వారి చెమట ను సైతం అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు.
పారిశుధ్య నిర్వహణ పనుల్లో రోజు క్రియాశీలకంగా పనిచేయాల్సిన సానిటరీ అధికారులు ఉన్నతాధికారులు లేదంటే ప్రజాప్రతినిధుల చుట్టూ చేరి గప్పాలు కొడుతూ కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలున్నాయి. అందువల్లే బాహాటంగా సాగుతున్న వసూళ్ళ దందా ల విషయంలో వారుకూడా లైట్ తీసుకుంటున్నారు .
