నిన్నటితో వేసవి సెలవలు ముగిశాయి. నేటినుంచి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాలలకు వెళ్లేందుకు చిన్నారులు సిద్ధంగానే ఉన్నప్పటికీ వారు ప్రయాణించే బస్సుల్లో భద్రత ఎంత అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. రెండు నెలలపాటు పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించినప్పటికీ ఈ రెండు నెలల కాలంలో కొందరు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సులకు మరమ్మతులు చేయించకపోవడం, అధికారుల వద్దకు వెళ్లి ఫిట్‌నెస్ చేయించుకోకపోవడం చూస్తుంటే వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.నిజామాబాద్ జిల్లాలో మొత్తం 787 బస్సులు ఉన్నాయి.అందులో కేవలం 497 మాత్రమే ఫిట్ నెస్ చేయించినట్లు తెలిపారు.ఇంకా 290 వరకు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఫిట్నెస్ చేయాలని ఆర్టీఏ అధికారులు తెలిపారు.అలాగే 15 సంవత్సరాలు దాటిన యధేచ్చగా నడుపుతున్న బస్సులను తనిఖీ చేసి వాటిని సీజ్ చేస్తామని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.అలాగే తల్లిదండ్రులు ప్రైవేట్ బస్సులలో ప్రయాణించే బస్సు కండిషన్ విద్యార్థుల తరలింపు వివరాలు ఇప్పటికప్పుడు తెలుసుకోవాలి. క్లీనర్ అటెండర్ ఉన్నారా? లేదా? అని నిర్ధారించుకోవాలి. స్కూల్ బస్సు డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరిం చాలి. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లొద్దు. డ్రైవర్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకుండా చర్యలు చేపట్టాలి. ట్రాఫిక్ నిబంధనలు తప్ప నిసరి పాటించాలి. 60 ఏళ్లు దాటిన వారిని డ్రైవర్లుగా కొనసాగించడం తగదని అధికారులు హెచ్చరించారు.విద్యా సంస్థలు బస్సులు తప్పనిసరిగా ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే చేయించని వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని ఆర్టీఏ అధికారులు రాహుల్ కుమార్, కిరణ్ కుమార్, హెచ్చరించారు.
.
.
