HomeCRIMEపండగకు ఊరెళుతున్నారా ...!అయితే ఈ జాగ్రత లు తీసుకోవాలి .....సీపీ కల్మేశ్వర్

పండగకు ఊరెళుతున్నారా …!అయితే ఈ జాగ్రత లు తీసుకోవాలి …..సీపీ కల్మేశ్వర్

దసర పండుగ సెలవులకు తమ సొంత ఊళ్లకు వెళ్లే వారు వెళ్లే దొంగల బారీన తాము చెప్పే పడకుండా జాగ్రత లు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ కోరారు శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను అపరిచిత వ్యక్తులు ఉదయం వేళ వెతకటం,

రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారని కావున ఇండ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లే వారు ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలన్నారు .

ఊళ్లకు వెళ్ళాక పక్కింటి వారి ద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిదన్నారు వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని వచ్చేలా ప్రణాళిక వేసుకొవాలన్నారు తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారంఇవ్వాలన్నారు.

ఇంట్లొ కుటుంబ సభ్యులు వెళ్లగా ఉన్న మహిళలు, వృద్ధులు “అపరిచితులు” సమాచారం పేరుతో వస్తే నమ్మకుండా ఉండాలనీ చెప్పాలి విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చినమ్మి వెళ్లకూడదు. ఊరు వెళ్లేటప్పుడు ఖరీదైన వస్తువులను ఇంట్లో ఉంచకపోవడమే మంచిది (లేదా) బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి .కాలనీల లో ” గస్తీ” దళాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు

.పోలీస్ లకు దొంగతనాలపై అనుమానితుల సమాచారం అందించాలన్నారు ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబరు (లేదా) సెల్ ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉంచుకోవాలన్నారు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి.

లేదా డయల్ 100 ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments