HomePOLITICAL NEWSArmoorపేకాట కు అడ్డాగా మారిన ఆర్మూర్ .... సేఫ్ జోన్ భావిస్తున్న నిర్వాహకులు ......ఉదాసీనత...

పేకాట కు అడ్డాగా మారిన ఆర్మూర్ …. సేఫ్ జోన్ భావిస్తున్న నిర్వాహకులు ……ఉదాసీనత ?లేదంటే మమ్ముళ్ల కు రుచి మరిగారా ? ……పోలీసుల తీరు ఫై విమర్శలు వెల్లువ ……అధికార పార్టీ కీలక నేత అండగా ఉన్నారని అపవాదు

జిల్లావ్యాప్తంగా పేకాట ఫై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతుంది. కమిషనర్ కల్మేశ్వర్ ఈ దందా విషయంలో అత్యంత కఠినంగానే ఉన్నారు. జిల్లా కేంద్రంలో స్టార్ హోటళ్ల ల్లోనూ వరస దాడులతో నిర్వాహకులను ఉక్కిరి బిక్కిరి చేశారు.

కానీ చాల మంది నిర్వాహకులు మహారాష్ట్ర ప్రాంతాలకు షిఫ్టు అయ్యారు. ఒకరిద్ద మాత్రం ఆర్మూర్ ప్రాంతం ను అడ్డాగా చేసుకొని పేకాట దందా ను యథేచ్ఛగా సాగిస్తున్నారు.

జిల్లాలో ఎక్కడా పేకాట అడ్డా తెరవడానికి ఆసక్తి చూపని నిర్వాహకులు ఆర్మూర్ ప్రాంతం ను సేఫ్ జోన్ గా మార్చుకోవడంపై విమర్శలు వెల్లు వెత్తు తున్నాయి. ఉదాసీనంగా వుండడం వల్లనే నిర్వాహకులు బరితెగిస్తున్నరా ? లేదంటే ముడుపులు మాట్లాడుకొని గుట్టుగా దందా సాగిస్తున్నారా ? అనేది చర్చనీయాంశం అయింది.

అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత తెర వెనుక చక్రం తిప్పుతున్నారనేది టాక్ .! జిల్లా అంతటా జూదం అడ్డాలను మూసేయించిన పోలీసులు ఆర్మూర్ ప్రాంతం మీద ఎందుకు డేగ కన్ను వేయలేక పోతున్నారనే చర్చ ఉంది.

ఆర్మూర్ ,కమ్మర్ పల్లి ,మోర్తాడ్ ప్రాంతాల్లో జూదం అడ్డాల మీద వరుస దాడులు ఆర్మూర్ పోలీసులు వైఫల్యాలను వెక్కిరిస్తున్నాయి. ఓ దశలో కమిషనర్ టాస్క్ ఫోర్స్ ను నమ్మలేని పరిస్థితి వచ్చేసింది. సామాన్యులు పేకాట వ్యసనానికి బానిసలై జేబులు గుల్ల చేసుకుంటున్నారు.

అనేక గ్రామాల్లో సమైక్యత కోసం నిర్మించుకున్న కుల సంఘ భవనాలు పేకాట కేంద్రాలుగా మారిపోయాయి. వేల్పూర్ మండలంలో పెద్ద వాగు, పరివాహక ప్రాంతాలు, కుల సంఘ భవనాలలో, మోర్తాడ్ మండలంలో ఏకంగా వ్యవసాయ క్షేత్రాల్లో మొక్కజొన్న పంట మధ్యలో, కమ్మర్ పల్లి మండలంలో శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్ లలో, నందిపేట్ మండలంలో గోదావరి పరివాహక ప్రాంతాలు, మాక్లూర్ మండలంలో అటవీ ప్రాంతాలు పేకాట అడ్డాలుగా మారిపోయాయి.

పేకాట రాయుళ్ళకు పెద్దరాయుడిలా మర్యాద చేస్తూ ఆర్మూర్ డివిజన్లో గ్రామీణ ప్రాంతాల్లో పేకాట స్థావరాలు వెలుస్తున్నాయి. గతంలో పట్టణ ప్రాంతాలకు పరిమితమైన ఈ పేకాట కేంద్రాలు ప్రస్తుతం గ్రామాలలో జోరుగా కొనసాగుతునదన్న చర్చ కొనసాగుతుంది.

ఆర్మూర్ పట్టణంలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆలోచనతో గోదావరి శివారు ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్ర శివారు ప్రాంతాలకు తరలి వెళ్లి పేకాట ఆడి వస్తున్నారు.

అయితే సుదూరం వెళ్లి ఆడడం కష్టం కావడంతో అడ్డాలను మార్చుకొని నిర్మానుషమైన గ్రామీణ ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని పేకాట స్థావరాలను నెలకొల్పారు.

గత నెల రోజుల వ్యవధిలో ఆర్మూరు పట్టణంలోని రెండు పేకాట స్థావరాలపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టణంలోని ప్రముఖులతో పాటు భారీ నగదును స్వాధీనం పరుచుకున్నారు. గత వారంలో కమ్మర్ పల్లి మండల కేంద్రంలో బంకెట్ హాల్ లో కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి సుమారు 35 మందిని అరెస్టు చేసిన ఘటన జిల్లాలో చర్చనీయంశమైంది.

అది జరిగి పట్టుమని వారం రోజులు కూడా గడవకముందే గత మొన్న వేల్పూరు మండల కేంద్రంలో పేకాట స్థావరంపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు 4200 నగదు పాటు ఐదుగురు పేకాటరాయలను అరెస్టు చేశారు.

నిన్నటి రోజు మోర్తాడు మండలం సుంకేట్ లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేసి ఓ రాజకీయ పార్టీ నాయకులతో పాటు ఏకంగా ఓ గ్రామ ఉపసర్పంచ్ ను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే పేకాట స్థావరాలపై ఎప్పుడు దాడి జరిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు తప్ప స్థానిక పోలీసులు ఓ కన్నెయడం లేదు అనే విమర్శ కొనసాగుతుంది.

జిల్లాస్థాయిలో పనిచేసే టాస్క్ ఫోర్స్ టీమ్ కు వెళ్లే సమాచారం, స్థానిక పోలీసులకు ఎందుకు అందడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. డివిజన్లోని ఆయా మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో పరిధిలో జరుగుతున్న ఈ పేకాట దందాపై పోలీసులు గట్టి నిఘా వేయడం లేదని ప్రజలు అంటున్నారు.

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు పేకాట రాయుళ్ల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. స్థానిక పోలీసులు కూడా దీనినీ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments