నిజామాబాద్ రూరల్ పరిధిలోని సారంగాపూర్ లో గల జిల్లా కేంద్ర కారాగారం కు రూ. 50 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ..
సారంగాపూర్ నుంచి సుమారు 2కిలోమీటరు దూరం లోపలికి ఉన్న సెంట్రల్ జైలు వరకు మట్టి రోడ్డు మాత్రమే ఉండేది. నిత్యం జైలు కు వెళ్ళే వాహనాల రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
దీంతో 50 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ ఆనంద్ రావు,జైల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.