నమస్తే పెట్టలేదంటూ తమ్మడు తో కలసి ఓ కార్పొరేటర్ ఓ యువకుడిని చితక బాదిన ఉదంతం నగరంలో గౌతం నగర్ లో జరిగింది .నగరంలోని .
40 డివిజన్ కు చెందిన సురేష్ తన అవసరాల నిమిత్తం రోడ్డు పై వెళ్తుండగా కార్పొరేటర్ చరణ్ అక్కడే నిల్చున్నాడు. దారిన వెళ్తున్న సురేష్ ను పిలిచి నా ముందు నుంచే వెళ్తావా? నేను ఇక్కడ నిలుచుండగా నా ముందు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లడానికి నీకు ఎంత ధైర్యం? కనీసం నమస్తే కూడా పెట్టావా అంటూ గద్దించారు.
అంతటి తో ఆగకుండా సురేష్ ను చితకబాదారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చరణ్ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో తనకు మద్దతు ఇవ్వకుండా వేరే పార్టీకి మద్దతు తెలుపుతున్నావని సురేష్ ని చితకబాదినట్లు సమాచారం.
దీంతో సదరు వ్యక్తి మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు. కానీ కార్పొరేటర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ వ్యక్తి వాపోయాడు. కార్పొరేటర్ పై చర్యలోకి తీసుకోకపోవడంతో పోలీసులపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
