Monday, December 8, 2025
HomeTelanganaNizamabadకాంగ్రెస్ లో చేరిన ఐదుగురు కౌన్సిలర్లు...

కాంగ్రెస్ లో చేరిన ఐదుగురు కౌన్సిలర్లు…

ఎల్లారెడ్డి మున్సిపల్ లో బి ఆర్ ఎస్ ఖాళీ — 9 కి పెరిగిన కాంగ్రెస్ బలం..—.. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వశం కానుంది. 8 మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లలో అయిదుగురు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

శనివారం హైదరాబాదులోని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఇంటికి వెళ్లి ఐదుగురు బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..

మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్ కు నలుగురు బి ఆర్ ఎస్ కు 8 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో ఐదుగురి చేరికతో కాంగ్రెస్ బలం 9 కి చేరుకుంది..

బి ఆర్ ఎస్ కు ముగ్గురు కౌన్సిలర్లు మిగిలారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుంది. మున్సిపాలిటీలో బిఆర్ఎస్ తరపున 9 మంది కౌన్సిలర్లు గెలుపొందగా,పద్మ శ్రీకాంత్, మునుగొండ భూదేవి శ్రీనివాస్, జంగం నీలకంఠం, అల్లం శ్రీనివాస్, బాలమణి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బిఆర్ఎస్ నుంచి ఎన్నికై మున్సిపల్ చైర్మన్ గా ఉన్న కుడుముల సత్యనారాయణ పార్లమెంట్ సాధారణ ఎన్నికలకు ముందు బి ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు.

దీంతో పార్టీ కౌన్సిలర్లు ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగడంతో సత్యనారాయణ పదవిని కోల్పోయారు. గత కొద్ది రోజులుగా జరిగిన నాటకీయ పరిణామాల మధ్య మెజారిటీ బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మదన్మోహన్రావును సంప్రదించి పార్టీలో చేరేందుకు మొగ్గుచూపారు.

పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెంచుకునేందుకు ఎమ్మెల్యే మదన్మోహన్రావు చక్రం తింపి మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పక్షాన వచ్చే విధంగా తన రాజకీయ చతురతను ప్రదర్శించారు.

ఎట్టకేలకు మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలం పెరగడంతో మెజార్టీ కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు పద్మ శ్రీకాంత్ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యా అవకాశం ఉంది. పద్మ శ్రీకాంత్ కు బి ఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కూడా మద్దతు పలికే అవకాశం ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!