Monday, December 8, 2025
HomeTelanganaNizamabadవిద్యారంగంలో వెనుకబడ్డ నిజామాబాద్ జిల్లా

విద్యారంగంలో వెనుకబడ్డ నిజామాబాద్ జిల్లా

అనే అంశంపై తెలంగాణ విద్యార్థి పరిషత్ రౌండ్ టేబుల్ సమావేశంఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

టీజీవిపి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి టీజీవిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సజ్జనం భానుచందర్ హాజరవడం జరిగింది మరియు ఏఐఎస్ఎఫ్, టీ.వీ.యు.వి,ఏఐపిఎస్యు సంఘాల నాయకులు పాల్గొని నిజామాబాద్ జిల్లా విద్యారంగ వెనుకబాటుపై తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది

ఈ సందర్భంగా టీజీవిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల కాలంగా నిజామాబాద్ జిల్లా విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని ఉన్న విద్యా వ్యవస్థలలోనే సమస్యలను పునరావృతం చేస్తూ ప్రజల,విద్యార్థుల, విద్యార్థి సంఘాల దృష్టి మరిలించే ప్రయత్నం చేస్తూ జిల్లాకు కొత్తగా ఎటువంటి విద్యావ్యవస్థలను కేటాయించకుండా మొండి చేయి చూపిస్తుయన్నారు

నిజామాబాద్ జిల్లాలో బీటెక్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పి పనులు మొదలుపెట్టి నిధుల కేటాయింపులో జాప్యం జరపడం సబబు కాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు త్వరితగతిన బీటెక్ కళాశాలకు సంబంధించిన పూర్తిస్థాయి నిధులను విడుదల చేసి విద్యార్థులకు కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా జిల్లాకు వెటర్నరీ కాలేజ్ కేటాయింపు జరపాలని కోరారు, పేద మధ్య తరగతి విద్యార్థులు వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేయడం వల్ల పశు సంక్షేమ శాఖకు సేవలు అందించే స్థాయిలో ఎదుగుతారని ఆయన ఆశించారు.

అనంతరం, AIPSU నాయకుడు బోడ అనిల్ మాట్లాడుతూ జిల్లాకు ఫార్మా కళాశాల ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు ఫార్మా కళాశాల అందుబాటులోకి తెస్తే వైద్యరంగంలో జిల్లా ముందుంటుందని ఆయన డిమాండ్ చేశారు,

ప్రస్తుత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు పై సమస్యలన్నీటిపైన స్పందించి జిల్లాకుతగు న్యాయం చేయాలని కోరారు ఎలక్షన్లకు ముందు జిల్లా పర్యటనల్లో రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో కళాశాలలను నిజామామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు

కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జిల్లాకు కళాశాలల కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, టీవీయువి సంఘం నాయకుడు లాల్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కాకుండా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గా కేవలం గిరిరాజ్ కాలేజ్ మాత్రమే ఉందని అది కాకుండా ఉమెన్స్ డిగ్రీ కళాశాల అనుబంధంగా హాస్టల్ తో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పై సమస్యల పై తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ వివిధ విద్యార్థి సంఘాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రానున్న రోజుల్లో తెలంగాణ విద్యార్థి పరిషత్ సమస్యలన్నీటిపైన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తుందని తెలిపారు

రానున్న రోజుల్లో పై సమస్యలన్నీటిపై ప్రజాప్రతినిధులకు మెమరండం ల ద్వారా నివేదిస్తామని అనంతరం నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిజివీపీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు మీసాల నాగేష్ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు ఏఐపిఎస్యు నాయకులు, టీవీయువి నాయకులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!