అరవింద్ వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని,కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని,కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత వచ్చిందని,అరవింద్ కుల గణనపై మాట్లాడుతున్నాడని విమర్శంచారు.
ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లడారు.కుల గణన విషయంలో బీజేపీ పాత్ర ముక్యంగా అరవింద్ యొక్క అభిప్రాయం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
జిల్లాకు అప్పుడప్పుడు వస్తూ ప్రభుత్వంపై మాట్లాడితే ఉరుకునేది లేదని హెచ్చరించారు.కులగణన చేయడం ద్వారా ఎవరి వాటా ఎంత అని తెలిస్తే తమ ఉనికికే ప్రమాదం అవుతుందని,ప్రతి ఒక్కరు తమ వాటా అడుగుతారని అరవింద్ భయపడుతున్నాడని bc కుల గణన చెయ్యల వద్దాఅని బండి సంజయ్ అరవింద్ చెప్పాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కి mlc అభ్యర్థి లేడు అని మాట్లాడుతున్నాడని ఇది అరవింద్ కు బుద్ధిలేని తనానికి నిదర్శనమని,కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల mlc అభ్యర్థి నరేందర్ రెడ్డి అని, జిల్లా పట్టభద్రులు నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని,ఉపాధ్యాయ ఏమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయులకే వదిలేశామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.
