జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్దజరిగిన రోడ్డు ప్రమాదం లో మహిళా ఎస్సై మృతి చెందారు. కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ డీసీఆర్‌బీలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేత జగిత్యాల్ వైపు తన కారు లో వెళ్తుంది.
ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనంఢీకొట్టింది కారు వేగం ఎక్కవగా ఉండడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్ళిపోయింది..
ఈ ప్రమాదంలో ఎస్సై తో పాటు బైకు మీద ఉన్న యువకుడు సైతం మృతి చెందారు.. కారు అతి వేగంగా వుండడం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..మృత దేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..,
ఎస్‌ఐ శ్వేత.. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి ఎస్‌ఐగా పని చేశారు…
