Friday, April 24, 2026
HomePOLITICAL NEWSనాలుగు రాష్ట్రల్లో మోగిన ఎన్నికల నగారా

నాలుగు రాష్ట్రల్లో మోగిన ఎన్నికల నగారా

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలతోపాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు. సంబంధించి షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది.తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ, అస్సాంతోపాటు పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది .

మే 7న వెస్ట్ బెంగాల్, మే 10న తమిళనాడు, మే 23న కేరళ, మే 28న అస్సాం, జూన్ 15న పుదుచ్ఛేరిలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని కేంద్ర ప్రధాన ఎన్నికల ముఖ్య కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషీలు ఎన్నికలకు సంబందించిన వివరాలు వెల్లడించారు.

ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్టు పేర్కొన్నారు. మొత్తం 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిట ప్రాంతంలో కలిపి 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు వారు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల సమరం లో ప్రధాన పార్టీలు దిగాయి. ముఖ్యంగా తమిళ్ నాడు బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎన్నికలు హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!